ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.. ఏం కోరారంటే?
- కావేరీ నదిపై కొత్త వివాదం
- కర్ణాటక డ్యామ్ ప్రతిపాదనకు తమిళనాడు వ్యతిరేకత
- మేకేదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్
- త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం విజయ్
- దిగువ రాష్ట్రాల అనుమతి తప్పనిసరని వ్యాఖ్య
కావేరీ నది నీటి పంపకాల వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటక కొత్త డ్యామ్ పనులకు సిద్ధమవడంతో తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుతూ ప్రధానమంత్రికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అత్యవసర లేఖ రాశారు.
మేకెదాటు దగ్గర కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ నిర్మించాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కర్ణాటక అక్కడ భూమి పూజకు ఏర్పాట్లు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.
కావేరీ నీటి వివాద ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ఉల్లంఘిస్తోందని విజయ్ ఆరోపించారు. ఈ ఆదేశాలను గతంలో సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువ రాష్ట్రాల అనుమతి లేకుండా కొత్తగా ఎలాంటి జలాశయాలు నిర్మించొద్దని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అంగీకారం కర్ణాటకకు తప్పనిసరని వివరించారు.
ట్రైబ్యునల్ అనుమతించిన ప్రాజెక్టుల జాబితాలో మేకెదాటు లేదని సీఎం విజయ్ పేర్కొన్నారు. కావేరీ బేసిన్లో ఇప్పటికే నీటి కొరత ఉందని లేఖలో రాశారు. ఉన్న నీటిని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేటాయించారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా భారీ జలాశయం నిర్మించడం సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుందని హెచ్చరించారు.
కాగా, త్వరలోనే విజయ్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసే అవకాశం ఉంది.